సంక్రాంతి పండగ కంటే ముందే రైతులందరి ఇళ్లలో పండగ వాతావరణం నెలకొనేలా చేయాలని, అందరికీ ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించాలని చెప్పారు సీఎం జగన్. ఇప్పటి వరకూ ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో జరిగింది. కానీ కొన్ని చోట్ల మాత్రం బకాయిలు ఇవ్వలేదు. దీంతో రైతులు చాలా సార్లు తమ బాధను స్థానిక నాయకులకు చెప్పుకున్నారు. ఈ వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. సంక్రాంతి నాటికి ఒక్క రూపాయి కూడా రైతులకు బకాయి ఉండకుండా చూడాలని ఆదేశించారు.