కొత్తరకం కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇటు ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ రాజమండ్రి ఘటన మినహా.. ఇంకెక్కడా రెండో కేసు నమోదైనట్టు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో తిరుపతిలో యూకేనుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అది యూకే వైరస్సా లేక, మామూలు కరోనా వైరస్సా అనేది తేలాల్సి ఉంది. కొత్త స్ట్రెయిన్ నిర్థారణ కోసం అతని శాంపిల్స్ ని పుణెలోని ల్యాబ్ కి పంపించారు.