ఇటీవలే భారత ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ, డీసీజీఐ అనుమతిచ్చిన కొవిషీల్డ్ టీకా పంపిణీ యూకేలో మొదలైంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థ సంయుక్తంగా తయారు చేసిన ఈ టీకాకు ఇదివరకే యూకే ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే అంతకంటే ముందే యూకే ప్రభుత్వం పైజర్ టీకాకు అనుమతిచ్చింది. దీంతో అక్కడ తొలి విడత ఫైజర్ టీకా పంపిణీ మొదలైంది. వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఫైజర్ టీకాను వేశారు. ఆక్స్ ఫర్డ్ టీకాకు కూడా అనుమతి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా ఈ టీకాను వినియోగించిన దేశంగా బ్రిటన్ ముందు వరుసలో నిలిచింది.