దేశవ్యాప్తంగా చేపట్టే సర్వేలలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంటే అంతకంటే కావాల్సిందేముంటుంది. అదే ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో మన హైదరాబాద్ కూడా ముందుంది అంటే.. అది మరింత విశేషం. అంతకు మించి అన్నట్టుగా.. హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్త సర్వేలో నెంబర్ 2 స్థానంలో నిలవడం మరింత ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన విషయం. అవును.. ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో లండన్, బీజింగ్ ని సైతం వెనక్కు నెట్టి హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఇదే లిస్ట్ లో ఫస్ట్ పేరు చెన్నై కావడం మరింత విశేషం.