ఏపీలో జగన్ ప్రభుత్వంలో బాగా కీలకంగా ఉండే మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నానినే అని చెప్పేయొచ్చు. తమ ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉంటూ, ప్రతిపక్షాలపై కొడాలి దూకుడుగా వెళతారు. అందుకే మొదట నుంచి టీడీపీ, కొడాలి నాని టార్గెట్గా రాజకీయాలు చేస్తూనే ఉంది. పైగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలికి తిరుగులేదు. అందుకే ఆయన్ని ఎలాగైనా గుడివాడ ప్రజల్లో నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు పనిచేస్తున్నారు.