ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు సినిమాల్లో సూపర్ ఇమేజ్ ఉంది. ఇక అదే ఇమేజ్ రాజకీయాల్లో కొనసాగుతుంది. కాకపోతే ఆ ఇమేజ్ ఓట్ల రూపంలో రావడం లేదు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడంలో పవన్ కల్యాణ్ పాత్ర చాలావరకు ఉంది. అప్పుడు వైసీపీ-టీడీపీలు పోటాపోటిగా ఉన్నాయి. గెలుపు ఎవరనేది అంచనాకు కూడా రాలేదు.