చాల మంది ఆడపిల్లను కనడానికి భయపడిపోతుంటారు. అయితే ఆడపిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేయాలనుకునే వారికి సుకన్య సమృద్ది యోజన అద్భుతమైన పొదుపు పథకంగా ఉపయోగపడుతుంది. ఇక పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించిన ఈ పథకంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. మీ అమ్మాయి చదువుకు, వివాహానికి అవసరమయ్యే ఖర్చుకు ఇది ఆర్థిక భరోసానిస్తుంది దీనిలో పెట్టుబడిపై అధిక వడ్డీతో పాటు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అన్ని పోస్టల్ సేవింగ్స్ ఖాతాలతో పోలిస్తే ఎస్ఎస్ఏపై అధిక వడ్డీ లభిస్తుంది.