సీఎం జగన్ నేరుగా చెప్పారో, లేక వారి మంత్రి వర్గంలోనివారు కాస్త ఆవేశ పడ్డారో తెలియదు కానీ.. మొత్తానికి వైసీపీ ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తుందనే వార్త ఆమధ్య బాగా వినిపించింది. సాక్షాత్తూ పౌర సరఫరాల శాఖ మంత్రే కొన్ని సందర్భాల్లో సన్నబియ్యం ఇస్తామని చెప్పడంతో ప్రజలంతా సంబరపడ్డారు. అయితే ఆ తర్వాత సన్నబియ్యంపై జరిగిన యుద్ధం అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలు ఏకంగా మంత్రిని సన్నబియ్యం పేరుతో టార్గెట్ చేశాయి. అదే స్థాయిలో అసలు సన్నబియ్యం ఎవరిస్తానన్నారు, మేలు రకం బియ్యం ఇస్తాము. అంతే.. అంటూ ఖరాఖండిగా చెప్పేశారు మంత్రి నాని.