భారత్ లో టీకా పంపిణీ ప్రక్రియకు తొలి అడుగులు పడ్డాయి. అత్యవసర పంపిణీకోసం రెండు టీకాలను ఎంపిక చేసింది ప్రభుత్వం. మరోవైపు టీకా పంపిణీ తేదీపై కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అటు డ్రై రన్ పేరుతో రాష్ట్రాల్లో ట్రయల్ రన్ మొదలు పెట్టింది కేంద్రం. కొవిన్ అనే పోర్టల్ లో డ్రైరన్ కార్యక్రమం అంతా నమోదైందని అధికారులు ప్రకటించారు కూడా. అయితే ఈ కొవిన్ ఏంటి? టీకా కావాలంటే దీనిలో నమోదు చేయించుకోవాలా? అనే అనుమానాలు సామాన్య ప్రజల్లో ఉన్నాయి. కొవిన్ అనే పేరు తెలిసింది కానీ, దాని గురించి పూర్తి వివరాలు మాత్రం బైటకు రాలేదు. కొంతమంది అత్యుత్సాహవంతులు కొవిన్ పేరుతో గూగుల్ సెర్చ్ చేసి మోసపోతున్నట్టు తెలుస్తోంది.