ఇటీవల కాలంలో దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎంల నిర్వహణను పట్టించుకోవడం మానేశాయి. ఏ బ్యాంకు ఖాతాదారులైనా, ఏ ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచయినా నగదు తీసుకోవచ్చనే వెసులుబాటుతో సగం ఈ నిర్లక్ష్యం మొదలైంది. ఆ తర్వాత ఆన్ లైన్ లావాదేవీల వల్ల ఏటీఎంల ఉపయోగం కూడా తగ్గడంతో వాటి నిర్వహణ, నగదు అందుబాటులో ఉంచడం వంటి విషయాల్లో బ్యాంకులు శ్రద్ధ పెట్టడం మానేశాయి. లాక్ డౌన్ టైమ్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కాగా.. తిరిగి ఇప్పుడు ఏటీఎంల వ్యవహారంలో బ్యాంకులు చురుకుగా మారబోతున్నట్టు తెలుస్తోంది.