ఈనెల 17వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలను సందర్శించి స్థానికుల అభిప్రాయం తీసుకుంటానని ప్రకటించారు త్రిదండి చినజీయర్ స్వామి. అయితే గతంలో కూడా పలుమార్లు ఆయన యాత్రలకు సిద్ధమైన సందర్భాలున్నాయి. కానీ అప్పుడు అవి సాధ్యం కాలేదు. ఈసారి కూడా చినజీయర్ యాత్ర మొదలు పెడతారా? లేక ఇది కూడా మొదలు కాకుండానే ఆగిపోతుందా అనే అనుమానాలున్నాయి.