ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులు ఇకపై కాలేజీ మారాలంటే పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. గతంలో ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ కాలేజీలకు సమర్పించి వాటికోసం తిరుగుతూ ఉండేవారు విద్యార్థులు. ఫీజుల పేరుతో ఇలాంటి వారి వద్దర డబ్బులు గుంజేవి యాజమాన్యాలు. ఒరిజినల్ సర్టిఫికెట్లు వారి చేతిలో ఉండటంతో అడిగినంతా సమర్పించి బైటపడేవారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ఇకపై ఇలాంటి కష్టాలు లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. కష్టపడకుండా తర్వాతి కౌన్సెలింగ్ లలో కాలేజీ మారే అవకాశం కల్పించింది.