ఏపీలో ప్రతిపక్షాలు మంత్రి కొడాలి నానీని గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ, ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్న నానీని, అవే ప్రతిపక్షాలు బాగా టార్గెట్ చేశాయి. ఆయన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అన్నీ పార్టీలు నానీని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. మొదట నుంచి చంద్రబాబు అండ్ బ్యాచ్ కొడాలిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూనే ఉంది.