ఏపీ ఆలయాల విషయంలో రాజకీయం బాగా జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇక జగన్ నేతృత్వంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ క్రిస్టియన్ అని, అందుకే హిందూ మతానికి వ్యతిరేకంగా వెళుతున్నారని మాట్లాడుతున్నారు. తాజాగా రామతీర్ధం ఘటనతో ఈ వివాదం మరింత ముదిరింది.