2019 ఎన్నికల్లో ఎన్నో ఆశలతో బరిలో దిగిన జనసేనకు ఒకే ఒక సీటు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ జగన్ సృష్టించిన సునామీ ఏంటో తెలుసు. ఆ సునామీలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. కానీ ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందంటే, ఆ పార్టీ తరుపున ఒక ఎమ్మెల్యే గెలవడం. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు.