కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దూకుడు ప్రదర్శిస్తుంది. రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలపై పోరాటం మొదలుపెట్టాయి. ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనే దిశగా కమల దళం ముందుకు కదులుతుంది. అయితే ఏపీ మీద పోలిస్తే తెలంగాణలో బీజేపీ మరింత దూకుడుగా ఉంది. పైగా బలం కూడా పుంజుకుంది. దానికి ఉదాహరణే...ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం, జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఓడించినంత పని చేయడం.