కరోనా క్లిష్ట సమయంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ మరో శుభవార్త చెప్పింది. Efftronics Private Ltd కంపెనీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100కు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి ఏడాకి రూ. 1.5 లక్షల నుంచి రూ. 5.2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. BTech, Diploma, ITI చేసిన వారు దరఖాస్తుకుఅర్హులు.