బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త. ఇక సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-బీఎస్ఎన్ఎల్. 365 రోజులకు రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. అంటే ఒక రోజుకు రూ.1 చొప్పున 365 రోజులకు రూ.365 చెల్లిస్తే చాలు. రూ.365 రీఛార్జ్ చేసినవారికి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజుకు 250 నిమిషాలు వస్తాయి. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అంతేకాదు రోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా వాడుకోవచ్చు.