ఏపీ హైకోర్టు జడ్జిల బదిలీపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆలయాల విధ్వంసం ఘటనపై స్పందించిన ఆయన.. ఇటీవల సీఎం జగన్ చేసిన కామెంట్లను తప్పుబట్టారు. గెరిల్లా వార్ ఫేర్ అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను పవన్ ఖండించారు. జగన్ శక్తిమంతుడని ఆయనపై, ఆయన ప్రభుత్వంపై గెరెల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సాహసం చేస్తారని సెటైర్లు వేశారు.