ఆమధ్య పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలని తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారు మంత్రి కొడాలి నాని. గతంలో కూడా పవన్ కల్యాణ్ పై కొడాలి తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడేవారు. అయితే కొంతకాలంగా ఆ డోస్ తగ్గించారు. కానీ ఇటీవల పవన్ కల్యాణ్ తనకు తానే నానీలనే పేరుని కించ పరచడంతో.. కొడాలి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మరిప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై కూడా ఆయన అదే స్థాయిలో స్పందిస్తారా..? స్పందిస్తే.. అది ఎలా ఉంటుంది..? ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది.