కొవిడ్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఇప్పటి వరకూ డ్రైరన్ తో సరిపెట్టినా.. టీకా నిల్వ, పంపిణీ.. వ్యవహారాలపై మరింత సమర్థంగా సిద్ధం అవుతున్నాయి. దీనిపై ఏపీ నూతన చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు. ఏపీలో తొలి విడతలో కోటిమందికి టీకా ఇవ్వబోతున్నట్టు స్పష్టం చేశారాయన. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు చేపట్టబోతున్న టీకాల ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.