ఏపీలో అమ్మఒడి రెండో దఫా ఆర్థిక సాయం ఈనెల 11న లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే లబ్ధిదారుల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచకపోవడంతో.. అందరిలో ఒకే టెన్షన్. ఈసారి అమ్మఒడి ఎవరికి పడుతుంది, ఎవరికి పడదు.. ఎవరెవరి పేర్లు హోల్డ్ లో ఉన్నాయి అనే సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. తొలి విడతలో వివిధ కారణాలతో రిజెక్ట్ లిస్ట్ లో పేర్లున్నవారు.. ఇప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ సమర్పించినా కూడా ఆందోళనతోనే ఉన్నారు.