పార్టీ పెట్టట్లేదంటూ సంచలన ప్రకటన చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారని, నేరుగా ప్రచారం చేయకపోయినా తన కార్యకర్తలు, అభిమానులకు బీజేపీకే ఓటేయమని చెబుతారని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే రజినీ ప్రకటన చేస్తారని కూడా అంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.