జగన్ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఒక్కసారే 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని, మంచి మంచి పథకాలు అందిస్తూ, ప్రజల మన్ననలని పొందుతున్నారు. అయితే జగన్ మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడే, మరో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెప్పారు. అలాగే పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు.