ఏపీ రాజకీయాల్లోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. హిందూపురం పర్యటనకు వచ్చిన బాలయ్య, వరుసగా జగన్ ప్రభుత్వంపై విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటున్న బాలయ్య, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ఇక హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య, అక్కడి పనులని పిఏల ద్వారా చూసుకుంటున్నారు.