ఏపీలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఓ వైపు ఆలయాలపై దాడుల ఘటనలు హీటెక్కిస్తుంటే, మరోవైపు టీడీపీ నేతలపై వచ్చి పడుతున్న కేసులు మరింత హాట్ హాట్ రాజకీయాన్ని నడుపుతున్నాయి. తాజాగా చంద్రబాబుపైన కూడా కేసు నమోదు కావడంతో టీడీపీ నేతలు హడావిడి చేసేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని స్వయంగా డీజీపీనే చెప్పారు.