2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధిస్తుందని ఎవరు ఊహించలేదు. ఆఖరికి ఆ పార్టీనే ఊహించి ఉండదు. గెలిచి అధికారంలోకి వస్తామని అనుకుని ఉంటారు గానీ, ఇంత బంపర్ మెజారిటీతో గెలిచేస్తామని ఊహించి ఉండరు. కానీ వైసీపీ 151 మంది గెలిచేశారు. అటు అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ ఘోరంగా 23 సీట్లకే పరిమితమైంది. ఇక ఎన్నో అంచనాలతో బరిలో దిగిన జనసేన ఒక సీటు గెలుచుకుంది.