జగన్ కేబినెట్లో ఫైర్‌బ్రాండ్ మంత్రులకు ఎలాంటి కొదవ లేదు. తమ శాఖలపై పట్టు తెచ్చుకుని, మంచిగా పనిచేసుకుంటూనే, తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం చేస్తారు. అలా ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారిలో మంత్రి అనిల్ కూడా ఒకరు. అనిల్ రెండోసారి నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసలు అనిల్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు.