పండగ వచ్చిందంటే చాలు సిటీలో ఉండే ప్రజలు ఊర్లకి ప్రయాణం కడతారు. ఇక దొంగలకు ఇదే మంచి సమయం తాళం వేసిన ఇళ్లను దోచుకొని వెళ్తుంటారు. అయితే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సాయంతో ఇళ్లను దొంగల బారి నుంచి కాపాడుకోవటంతో పాటు, నేరగాళ్లను ఈజీగా పట్టుకోవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీనికి కావాల్సిందల్లా మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.