లాక్ డౌన్ వేళ.. మద్యం దొరక్క చాలామంది శానిటైజర్ తాగి ప్రాణాలు వదిలిన సంఘటనలు దేశవ్యాప్తంగా చాలానే బైటపడ్డాయి. ఏపీలో కూడా ఇలాంటి ఉదాహరణలున్నాయి. ఇక ఇప్పుడు కరోనాకి విరుగుడుగా ఇస్తున్న వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా కొన్నిరోజులపాటు మద్యానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పాటించాల్సిన ఆహార నియమాల గురించి వివరిస్తూ.. ప్రత్యేకంగా ఆహారపదార్థాల విషయంలో కండిషన్లు పెట్టకపోయినా.. మద్యం తాగకుండా ఉండాలని మాత్రం సూచిస్తున్నారు.