దేశవ్యాప్తంగా అలజడి రేపుతున్న బర్డ్ ఫ్లూ భయం ఏపీని కూడా వదలడంలేదు. ఇప్పటికే కొన్నిచోట్ల కాకులు చనిపోతే.. వాటి దగ్గరనుంచి భయపడి పారిపోతున్నారు ప్రజలు. వెంటనే అధికారులకు సమాచారమిచ్చి హడావిడి చేస్తున్నారు. అయితే నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి విషయాలపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని, లేనిపోని భయాందోళనలు సృష్టించొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్ అమ్మకాలపై కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.