ఇన్నాళ్లూ కేంద్రంపై కేసీఆర్ మాత్రమే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఇటీవల ఆయన కూడా కాస్త సైలెంట్ అయ్యారనుకోండి. అయితే ఇప్పుడు కేటీఆర్ కొత్తగా కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణకు అన్యాయంచేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్రం ఆర్భాటంగా ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్నారాయన. ఈమేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి లేఖ రాశారు కేటీఆర్.