కరోనా వేళ.. పాలసీదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. రిస్క్ కవర్ ని కొనసాగించిన మరోసారి పాలసీదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ. ల్యాప్స్ అయిపోయిన పాలసీల పునరుద్ధరణకు మరో అవకాశాన్నిచ్చింది. ఈమేరకు ప్రచారం కూడా మొదలు పెట్టింది. మార్చి 6 వరకు ఇలా ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం ఉందని ప్రకటించారు అధికారులు. ఇప్పటి వరకు ల్యాప్స్ అయిన పాలసీలను నామమాత్రపు అపరాధ రుసుముతో పునరుద్ధరించుకోవచ్చని, ఇకపై ఇలాంటి అవకాశాలు రాకపోవచ్చని చెబుతున్నారు.