తెలంగాణ పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికే అనుకున్నారంతా.. కుదరకపోతే కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కూడా అవకాశముందని అంచనా వేశారు. అయితే కోమటిరెడ్డి కుటుంబాన్నుంచి బీజేపీ బెదిరింపు వినపడటంతో.. అధిష్టానం కూడా గుర్రుగా ఉందని, దాదాపుగా పీసీసీ పదవి రేవంత్ కే ఖాయమైందనే వార్తలూ వినిపించాయి. ఈ దశలో అసలు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు టీపీసీసీ ప్రకటన ఉండదని ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి రేవంత్ పేరు వెనకపడిపోయింది.