ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూ, మరోవైపు బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ బాధ్యతలు చూసుకుంటున్న బాలయ్య, తాజాగా ఎమ్మెల్యేను అనే సంగతి గుర్తుపెట్టుకుని హిందూపురంలో పర్యటిస్తున్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య, పెద్దగా హిందూపురం వచ్చిన దాఖలాలు లేవు. అక్కడ ఏ పనులైన పిఏల ద్వారానే నడిపించేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు హిందూపురంలో సొంత డబ్బులు పెట్టి పనులు కూడా చేయిస్తున్నారు.