ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉంది. జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. ప్రతి పథకంపై వంకలు పెడుతూనే ఉంది. అలాగే టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సైతం జగన్ ప్రభుత్వంపై గుప్పిస్తున్నాయి.