ఏపీలో జగన్ ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ నేతలు ప్రతి విషయంలోనూ జగన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే పలు సమస్యలపై పోరాటం కూడా చేస్తున్నారు. కానీ టీడీపీ చేస్తున్న విమర్శలని వైసీపీ కౌంటర్ ఇచ్చేస్తుంది. కాకపోతే వీరి పోరాటం ప్రజల్లో పెద్దగా క్లిక్ అవ్వడం లేదు.