సాధారణంగా అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష నేతలు జంప్ చేస్తుంటారు. అలాగే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచినవారు కూడా అధికార పార్టీ వైపు వెళ్లిపోతారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది. పలువురు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు టీడీపీలోకి వచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు జగన్ పంచనా చేరారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం జంప్ చేయలేరని అంతా అనుకున్నారు.