పంజాబ్లోని డేరా బస్సిలో ఓ భర్తకు దొంగలు ఊహించని ఝలక్ ఇచ్చారు. పిల్లల ఫీజు కట్టేందుకు భార్యతో కలిసి స్కూల్ కు వెళ్లాడు ఓ భర్త. భార్యను కారులోనే వదిలి ఫీజు కట్టేందుకు స్కూల్ లోకి వెళ్లి వచ్చే సరికి భర్త దిమ్మతిరిగే షాక్ తగిలింది. భార్యను కారులోనే వదిలి పనిమీద వెళ్లిన క్రమంలో ఆమెతో సహా కారును ఎత్తుకుపోయారు కొందరు దొంగలు. ఈ షాకింగ్ ఘటన జనవరి 7న జరిగింది.