కరోనా నుంచి ఇంకా కోలుకోకముందే బర్డ్ ఫ్లూ ముంచుకొస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్, కోడిగుడ్లు తినకూడదనే ప్రచారం సాగుతోంది. దాని ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడడంతో పౌల్ట్రీ వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచించినా ప్రజలు కోడి పేరెత్తితేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు.