దేశవ్యాప్తంగా డ్రైరన్ పేరుతో నిర్వహించిన కొవిడ్ టీకా పంపిణీ ట్రయల్ వెర్షన్లో పలు ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. అధికారులు, సిబ్బంది సన్నద్ధత బాగానే ఉన్నా.. సాఫ్ట్ వేర్ లో సమస్యలు ఉన్నట్టు స్పష్టమయింది. సిబ్బంది అవగాహనతోపాటు, కొవిన్ అనే సాఫ్ట్ వేర్ పనితీరు తెలుసుకోడానికే ముఖ్యంగా ఈ డ్రైరన్ నిర్వహించారు. అయితే ఆ సాఫ్ట్ వేర్ లో పలు సమస్యలు ఉన్నట్టు ఇప్పుడు బైటపడింది. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు సిద్ధపడింది.