ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. తొలుత 9వతేదీ అనుకున్నా, వివిధ కారణాలతో అది 11కి వాయిదా పడింది. 11వతేదీన నెల్లూరులో సీఎం జగన్ అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు, ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ అవుతుంది. అయితే శుక్రవారం రాష్ట్రంలో జరిగిన అనూహ్య పరిణామాలు అమ్మఒడికి అడ్డంకిగా మారుతాయని తెలుస్తోంది.