రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బాలకృష్ణ.. గత 19నెలలుగా హిందూపురం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో ఓసారి రోడ్ షో నిర్వహించి హడావిడి చేసినా.. ఆ తర్వాత పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, కనీసం అసెంబ్లీలో కూడా తన నియోజకవర్గం తరపున కానీ, పార్టీ తరపున కానీ మాట్లాడటంలేదని బాలయ్యపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. హిందూపురంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.