వ్యవయాసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతూనే.. మరోవైపు మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు రైతులకు ఉచిత విద్యుత్ కార్యక్రమం ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం మోటర్లకు మీటర్లు బిగిస్తామంటోంది. అదే సమయంలో విద్యుత్ బిల్లులు కూడా ఇస్తామని, అయితే ఆ బిల్లుల మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని భరోసా ఇస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఇబ్బంది లేకుండా సాగిపోతున్న ఈ పథకంలో మీటర్లు, బిల్లులు అంటే లేనిపోని తలనెప్పి తప్పదని రైతులు వాపోతున్నారు.