ఏపీలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం ఫీజు రాయితీ భారం మోపింది. ఎలాగూ ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభిస్తుండటంతో.. ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా ఫీజు రాయితీ ఇవ్వాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ధిక్కరించి యాజమాన్యాలు పూర్తి ఫీజు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.