ఏపీలో టీడీపీ బాగా బలంగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ త్వరగా కోలుకున్న జిల్లా కూడా శ్రీకాకుళమే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. మొదట కింజరాపు ఫ్యామిలీ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంది. ఆ ఫ్యామిలీలో అచ్చెన్నాయుడు ఏపీ అధ్యక్షుడుగా, టెక్కలి ఎమ్మెల్యేగా దూసుకెళుతున్నారు. అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు.