జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే, మరో వైపు రాజకీయాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటూ, మళ్ళీ రాష్ట్రంలో ఏమన్నా సమస్యలు ఉంటే వాటిపై పోరాటం చేయడానికి పవన్ వస్తున్నారు. మొన్నటివరకు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులని పవన్ పరామర్శించిన విషయం తెలిసిందే. తుఫాన్ వల్ల నష్టపోయిన జిల్లాల్లో పర్యటించి, రైతులకు అండగా నిలిచారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేశారు.