అతి త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించడంతో తిరుపతి స్థానానికి ఎన్నికలు అనివార్యమైనవి. ఇక 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో, అన్నీ పార్టీలు తిరుపతిలో పాగా వేయాలని చూస్తున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేనలు, ఇతర పార్టీలు తిరుపతి బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.