ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా సరే రాజకీయాలకు సెంటర్‌గా ఉన్న విజయవాడలో మాత్రం టీడీపీదే పైచేయి. 2014 ఎన్నికలు కావొచ్చు, జగన్ వేవ్ ఉన్న 2019 ఎన్నికలు కావొచ్చు, నగరంలో టీడీపీ సత్తా చాటింది. 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సీటుతో పాటు విజయవాడ తూర్పు సీటుని మంచి మెజారిటీతో టీడీపీ గెలిచింది. అయితే సెంట్రల్ సీటుని కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే విజయవాడ వెస్ట్ సీటుని తక్కువ మెజారిటీతో కోల్పోయారు.