తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి పండగ ఒక్కటి. ఈ పండగను తెలంగాణలో కంటే ఏపీలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ సమయానికి పండించిన పంట ఇంటికి చేరుతుంది. కొత్త అల్లుళ్లతో, కోడి పందాలతో ఎంతో కోలాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతిని దేశంలో వేర్వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంతేకాదు రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు.